హర్యానా స్థానిక ఎన్నికల్లో మేమెందుకు ఓడిపోయామంటే, ఓటర్లంతా సెలవులకు లాంగ్ టూర్లు వెళ్లినందుకు, బీజేపీ వింత వాదం

| Edited By: Anil kumar poka

Dec 31, 2020 | 7:21 PM

హర్యానాలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తామెందుకు ఓడిపోయామో బీజేపీ గురువారం వివరణ ఇచ్చింది.

హర్యానా స్థానిక ఎన్నికల్లో మేమెందుకు ఓడిపోయామంటే, ఓటర్లంతా సెలవులకు లాంగ్ టూర్లు వెళ్లినందుకు, బీజేపీ వింత వాదం
Follow us on

హర్యానాలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తామెందుకు ఓడిపోయామో బీజేపీ గురువారం వివరణ ఇచ్చింది. మొత్తం 5 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను మూడింటిని బీజేపీ కోల్పోయింది. కమలం పార్టీ, దాని మిత్ర పక్షమైన జననాయక్ జనతా పార్టీ సోనీపట్, అంబాలలో మేయర్ పదవులను కూడా పోగొట్టుకుంది. హిస్సార్ లోని ఉకాలనా, రేవారీ లోని ధరుహెరాలలో ఓటమిని చవి చూసింది. అయితే ఇందుకు కారణాలను హర్యానా బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ శర్మ వివరిస్తూ…. డిసెంబరు 25,26,27 తేదీలు వరుసగా సెలవు రోజులని, సంవత్సరాంతంలో వచ్ఛే ఈ సెలవు రోజుల్లో ప్రజలు తమ ఊళ్లకు లాంగ్ ట్రిప్స్ వేస్తుంటారని చెప్పారు. ఇలా వెళ్లినవారిలో చాలామంది బీజేపీ ఓటు బ్యాంకుకు తోడ్పడేవారేనన్నారు. ఏమైనా రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అన్నదాతలు చేస్తున్న ఆందోళన ఈ స్థానిక ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో బీజేపీ-జేజేపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత ఈ కూటమి ఈ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.

నిజానికి అంబాలా హోం మంత్రి అనిల్ విజ్ సొంత జిల్లా.. ఇక్కడి రైతులు బీజేపీ ఓటమితో ఆనందంతో స్వీట్లు పంచుకుని పాటలకు డ్యాన్సులు చేశారు. ఈ సారి అంబాలా సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56.3 శాతం పోలింగ్ నమోదైంది.