హీరో గుండెలపై పచ్చబొట్టు ‘కుక్క కోసం ఇలా’..

|

Jul 24, 2020 | 5:13 AM

హాలీవుడ్​ హీరో ఆర్లాండో బ్లూమ్​.. తన పెంపెడు కుక్క జ్ఞాపకార్థంగా దాని పేరును గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. దాన్ని ఎంతగానో మిస్​ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దానికి సంబంధించిన వీడియోనూ ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు. తప్పిపోయిన తన పెంపుడు శునకం ‘మైటీ’ చనిపోయి ఉంటుందని..  ఇక తిరిగి రాకపోవచ్చని నిర్ధరణకు వచ్చాడు. ‘మైటీ’కి నివాళులు అర్పించి.. ఎంతగానో మిస్​ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు ఏడు రోజుల పాటు రాత్రింబవళ్లు దాని కోసం వెతికి […]

హీరో గుండెలపై పచ్చబొట్టు కుక్క కోసం ఇలా..
Follow us on

హాలీవుడ్​ హీరో ఆర్లాండో బ్లూమ్​.. తన పెంపెడు కుక్క జ్ఞాపకార్థంగా దాని పేరును గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. దాన్ని ఎంతగానో మిస్​ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దానికి సంబంధించిన వీడియోనూ ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు. తప్పిపోయిన తన పెంపుడు శునకం ‘మైటీ’ చనిపోయి ఉంటుందని..  ఇక తిరిగి రాకపోవచ్చని నిర్ధరణకు వచ్చాడు.

‘మైటీ’కి నివాళులు అర్పించి.. ఎంతగానో మిస్​ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు ఏడు రోజుల పాటు రాత్రింబవళ్లు దాని కోసం వెతికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపాడు. సాధ్యమైన ప్రతిచోట వదలకుండా గాలిస్తూనే ఉన్నామని తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఏడవ రోజు దాని మెడ చుట్టూ ఉండే బెల్టు దొరికింది. ఇక అదిలేదని నాకు అర్థమైంది.. అది లేని లోటును నేను ఎంతగానో మిస్​ అవుతున్నాను అని ట్వీట్ చేశాడు.