ప్రతిపక్షాలు లేకుండా..2 రోజుల్లో, 15 బిల్లులకు రాజ్యసభ ఆమోదం

| Edited By: Pardhasaradhi Peri

Sep 23, 2020 | 8:05 PM

ప్రతిపక్షాలు లేకుండా రెండు రోజుల్లో 15 బిల్లులను రాజ్యసభ ఆమోదించింది.  ఆదివారం నాడు సభలో పెద్దఎత్తున గందరగోళం జరగడం, ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్, ఉభయ సభలను విపక్షాలు బాయ్ కాట్ చేయడం..

ప్రతిపక్షాలు లేకుండా..2 రోజుల్లో, 15 బిల్లులకు రాజ్యసభ ఆమోదం
Follow us on

ప్రతిపక్షాలు లేకుండా రెండు రోజుల్లో 15 బిల్లులను రాజ్యసభ ఆమోదించింది.  ఆదివారం నాడు సభలో పెద్దఎత్తున గందరగోళం జరగడం, ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్, ఉభయ సభలను విపక్షాలు బాయ్ కాట్ చేయడం, ఈ సెషన్ లో ముఖ్య ఘటనలు.కాగా-నిన్న ఏడు బిల్లులను, బుధవారం ఎనిమిది బిల్లులను సభ ఆమోదించింది. వీటిలో మూడు  వివాదాస్పదమైన లేబర్ బిల్లులుఉన్నాయి…., వీటిని ఆర్ ఎస్ ఎస్ సహా పలు కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలుస్తోంది. అటు-ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్ విచారకరమని, కానీ తప్పనిసరైందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అలాగే విపక్షాలు ఉభయ సభలను బాయ్ కాట్ చేయడాన్ని కూడా ఆయన ఆక్షేపించారు.