ఆ రెండు రోజులూ బ్యాంకులు బంద్.. ఎందుకంటే.?

|

Jan 17, 2020 | 5:54 AM

దేశవ్యాప్తంగా బ్యాంక్ యూనియన్లు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చాయి. వేతన సవరణపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో కేంద్రం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 31, ఫిబ్రవరి 1 వెరసి రెండు రోజులు దేశవ్యాప్తంగా సమ్మెకు చేయనున్నాయి. అంతేకాకుండా మళ్ళీ మార్చి 11 నుంచి 13 వరకూ కూడా సమ్మె చేపడతామని బ్యాంకు యూనియన్ల సమాఖ్య స్పష్టం చేసింది. అయితే ఒకవేళ అప్పటికీ కూడా డిమాండ్లకు పరిష్కారం దొరకని నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెకు […]

ఆ రెండు రోజులూ బ్యాంకులు బంద్.. ఎందుకంటే.?
Follow us on

దేశవ్యాప్తంగా బ్యాంక్ యూనియన్లు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చాయి. వేతన సవరణపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో కేంద్రం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 31, ఫిబ్రవరి 1 వెరసి రెండు రోజులు దేశవ్యాప్తంగా సమ్మెకు చేయనున్నాయి. అంతేకాకుండా మళ్ళీ మార్చి 11 నుంచి 13 వరకూ కూడా సమ్మె చేపడతామని బ్యాంకు యూనియన్ల సమాఖ్య స్పష్టం చేసింది. అయితే ఒకవేళ అప్పటికీ కూడా డిమాండ్లకు పరిష్కారం దొరకని నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యూఎఫ్‌బీయూ పశ్చిమ బెంగాల్‌ కన్వీనర్‌ సిద్ధార్థ ఖాన్ ప్రకటించారు.

ఐబీఏ 12.25 శాతం వేతన పెంపు తమకు ఆమోదయోగ్యం కాదన్న ఆయన సత్వరం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కాగా, నెలాఖరు నుంచి బ్యాంకులు తలపెట్టిన సమ్మెతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందంటున్న ఖాతాదారులు దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.