విమానంలో విందు భోజనం చేయాలనుందా..? ఇంకెందుకు ఆలస్యం..!

| Edited By:

Jul 08, 2019 | 11:31 AM

విమానంలో కూర్చోని చికెన్ ధమ్ బిర్యానీ తింటుంటే ఎలా అనిపిస్తుంది..? ఆ.. అనుభూతే వేరు.. కదా..! అలాగే.. విమానం విండో నుంచి ప్రకృతి అందాలను చూస్తూ.. భోజనం చేస్తూంటే ఆ కిక్కే వేరబ్బా..! మరి మీరు కూడా విమానంలో భోజనం చేయాలనుకుంటున్నారా..? మరి ఇంకెందుకు ఆలస్యం.. ఛలో విజయవాడ. సాధారణంగా బయట రెస్టారెంట్‌లకు వెళ్లి తింటూంటాం.. కొంచెం కొత్తగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూంటారు. కానీ.. విమానంలోని రెస్టారెంట్‌లో భోజనమంటే.. కాస్త కొత్తగానే ఉంది కాదా..! విమానంలో […]

విమానంలో విందు భోజనం చేయాలనుందా..? ఇంకెందుకు ఆలస్యం..!
Follow us on

విమానంలో కూర్చోని చికెన్ ధమ్ బిర్యానీ తింటుంటే ఎలా అనిపిస్తుంది..? ఆ.. అనుభూతే వేరు.. కదా..! అలాగే.. విమానం విండో నుంచి ప్రకృతి అందాలను చూస్తూ.. భోజనం చేస్తూంటే ఆ కిక్కే వేరబ్బా..! మరి మీరు కూడా విమానంలో భోజనం చేయాలనుకుంటున్నారా..? మరి ఇంకెందుకు ఆలస్యం.. ఛలో విజయవాడ.

సాధారణంగా బయట రెస్టారెంట్‌లకు వెళ్లి తింటూంటాం.. కొంచెం కొత్తగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూంటారు. కానీ.. విమానంలోని రెస్టారెంట్‌లో భోజనమంటే.. కాస్త కొత్తగానే ఉంది కాదా..! విమానంలో రెస్టారెంట్లను సాధారణంగా ఎక్కడా చూసి ఉండం. ఈ మధ్య ఢిల్లీలో ఓ పాత విమానంలో కొత్తగా ‘రన్ వే ఫుడ్’ అని స్టార్ట్ చేశారు. దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో.. దీన్నే విజయవాడలో ట్రై చేస్తున్నారు. పీ4 ఫ్యాక్టరీ నిర్వాహకులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతికి సమీపంలో విజయవాడ – గన్నవరంకి మధ్యలో ‘ఎయిరో‌ప్లైన్ రెస్టారెంట్’ రెడీ అవుతోంది. అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.