వృత్తి పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

|

Aug 25, 2020 | 1:09 AM

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీలకు వృత్తి పన్నును పెంచుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరణ చేసి తాజాగా కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసింది.‌

వృత్తి పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Follow us on

Occupation Tax Increase: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీలకు వృత్తి పన్నును పెంచుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరణ చేసి తాజాగా కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసింది.‌ వృత్తి పన్నులకు చెందిన రెండు శ్లాబులలోని ఓ శ్లాబును పెంచుతున్నట్లు జీవోలో పేర్కొంది. రూ. 1250గా ఉన్న వృత్తి పన్ను శ్లాబును రూ. 2000కు పెంచింది. ఏడాదికి రూ. 2500 మించకుండా వృత్తి పన్ను వసూలు చేస్తున్నట్టు తెలిపింది.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

అలాగే రూ. 10 లక్షల లోపు టర్నోవర్‌ ఉన్న వాణిజ్య సంస్థలకు వృత్తి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. అటు రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల లోపు టర్నోవర్‌ ఉన్నవారికి రూ. 2 వేలు, రూ. 25 లక్షలు ఆపై టర్నోవర్‌ దాటిన సంస్థలకు రూ. 2500 వృత్తి పన్ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇక సినిమా పరిశ్రమలో పని చేసేవారికి రూ. 2500గా విధించింది. జిల్లా, రాష్ట్ర స్థాయి సహకార సంఘాలకు, వీడియో లైబ్రరీ, వే బ్రిడ్జి ఆపరేటర్లకు వృత్తి పన్ను రూ. 2500గా ఖరారు చేసింది. పబ్లిక్‌ టెలిఫోన్‌ ఆపరేటర్లకు వృత్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వగా… టేక్‌ ఏవే ఫుడ్‌ పాయింట్లు, కర్రీ పాయింట్లు, క్యాంటీన్లకు రూ. 2500 వృత్తి పన్ను విధించింది.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..