న్యూడిస్టులు ఎంతపనిచేస్తున్నారు..!

|

Aug 24, 2020 | 8:10 PM

ఆరున్నర కోట్ల జనాభా ఉన్న ఫ్రాన్స్ దేశాన్ని కరోనా వైరస్ కకావికలం చేసింది. ఈ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య తాజా లెక్కల ప్రకారం 2లక్షల 50వేలకు చేరుతోంది. గడిచిన 24 గంటల్లో..

న్యూడిస్టులు ఎంతపనిచేస్తున్నారు..!
Follow us on

ఆరున్నర కోట్ల జనాభా ఉన్న ఫ్రాన్స్ దేశాన్ని కరోనా వైరస్ కకావికలం చేసింది. ఈ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య తాజా లెక్కల ప్రకారం 2లక్షల 50వేలకు చేరుతోంది. గడిచిన 24 గంటల్లో 4వేల 9వందల కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఫ్రాన్స్‌, మోంటాపెల్లియర్‌లోని ఫేమస్ నేచురిస్ట్‌ రిసార్ట్‌ ‘కాప్‌ డిఎగ్డే’ హాట్ స్పాట్ అయి కూర్చుంది.

అక్కడ సేదతీరుతున్న దిగంబరుల నిర్లక్ష్యం కారణంగా రిసార్టులో ఇప్పటి వరకు 95 మందికి వైరస్‌ సోకింది. హాలిడే కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్లిన 55 మంది వైరస్ భారిన పడ్డారు. న్యూడిస్టులు సోషల్ డిస్టెన్స్ పాటించపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఫ్రెంచ్‌ వైద్యాధికారులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకంటే రిసార్టులో వైరస్‌ వ్యాప్తి నాలుగు రెట్లు అధికంగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.