
మోదీ ఓటింగ్ యంత్రాలతో గానీ, మోదీ మీడియాతో గానీ తాము భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ నేతల ఆలోచనలపై తాము పోరాడుతున్నామని, ఆ ఆలోచనలను నీరుగారిస్తామని ఆయన చెప్పారు. బుధవారం బీహార్ లోని అరారియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన, మోడీకి అనుకూల ఈవీఎం లు, అనుకూల మీడియా ఉన్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ ‘మిస్టర్ మోదీ, అయన గ్యాంగ్ ముందు మోకరిల్లిందని రాహుల్ ఆరోపించారు. తమకు అనుకూలంగా మోడీ ప్రభృతులు వీటిని మలచుకోగలరని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.