‘యతి’ స్టోరీ.. రివర్స్.. మళ్లీ అదే సస్పెన్స్

| Edited By:

May 02, 2019 | 12:10 PM

హిమాలయ మంచు పర్వత్వాలో యతి(మంచు మనిషి) జాడలు కనిపించాయంటూ ఇటీవల భారత ఆర్మీ అధికారులు ఓ ప్రకటన చేశారు. అయితే దీనిని నేపాల్ ఆర్మీ అధికారులు ఖండించారు. అవి యతి పాదముద్రలు కాదని వారు స్పష్టం చేశారు. అక్కడ ఓ ఎలుగుబంటి తిరుగుతోందని, తరచూ ఆ ప్రాంతంలో ఈ ముద్రలు కనిపిస్తూ ఉంటాయని వారు పేర్కొన్నారు. కాగా మేజర్ మనోజ్ నేతృత్వంలోని 18మంది సైనికుల బృందం ఏప్రిల్ 2న నేపాల్ మకలు పర్వతారోహణకు వెళ్లారు. ఈ క్రమంలో […]

‘యతి’ స్టోరీ.. రివర్స్.. మళ్లీ అదే సస్పెన్స్
Follow us on

హిమాలయ మంచు పర్వత్వాలో యతి(మంచు మనిషి) జాడలు కనిపించాయంటూ ఇటీవల భారత ఆర్మీ అధికారులు ఓ ప్రకటన చేశారు. అయితే దీనిని నేపాల్ ఆర్మీ అధికారులు ఖండించారు. అవి యతి పాదముద్రలు కాదని వారు స్పష్టం చేశారు. అక్కడ ఓ ఎలుగుబంటి తిరుగుతోందని, తరచూ ఆ ప్రాంతంలో ఈ ముద్రలు కనిపిస్తూ ఉంటాయని వారు పేర్కొన్నారు.

కాగా మేజర్ మనోజ్ నేతృత్వంలోని 18మంది సైనికుల బృందం ఏప్రిల్ 2న నేపాల్ మకలు పర్వతారోహణకు వెళ్లారు. ఈ క్రమంలో వారికి 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్న పాదముద్రలు కనిపించగా.. అవి యతివేమోనని అభిప్రాయపడ్డ వారు తమ ట్విట్టర్‌లో అందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.