Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్.. కారణమిదే

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జల మండలి అధికారులు కీలక ప్రకటన చేశారు. శనివారం నుంచి ఆదివారం వరకు అనగా 24 గంటల పాటు తాగు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని తెలిపారు. మరి ఆ ప్రాంతాలు ఏంటి.? ఆ వివరాలు ఇలా..

Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్.. కారణమిదే
Drinking Water Supply
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 08, 2025 | 4:34 PM

హైదరాబాద్ జలమండలి పరిధిలోని హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఫోర్ బే, మిరాలం ఫిల్టర్ బెడ్స్ సెట్లింగ్ ట్యాంకులు, ఇన్‌లెట్ ఛానళ్లను శుభ్రం చేయనున్నారు అధికారులు. ఈ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేసే క్రమంలో 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ(శనివారం)న ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు 12వ తేదీ(ఆదివారం)న ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోనుంది.

హసన్ నగర్, కిషన్ బాగ్, దూద్ బౌలి, మిస్రిగంజ్, పత్తర్ గట్టి, దారుల్ షిఫా, మొఘల్ పురా, జహానుమా, చందూలాల్ బరాదరి, ఫలక్‌నుమా, జంగంమెట్ ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఉండదన్నారు. ఈ అంతరాయాన్ని గ్రేటర్ వాసులు దృష్టిలో ఉంచుకుని జలమండలి అధికారులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి