సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఆధారాలు లేవు : కేంద్ర రక్షణ శాఖ

| Edited By:

May 07, 2019 | 9:01 PM

యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన సర్జికల్ దాడులకు సంబంధించి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. 2004-14 మధ్య కాలంలో జరిగిన సర్జికల్ దాడుల వివరాలు కావాలంటూ రక్షణ శాఖ అధికారులను జమ్మూ ప్రాంతానికి చెందిన రోహిత్ చౌదరీ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా కోరారు. దీనికి స్పందించిన అధికారులు 2004-14 మధ్య జరిగిన సర్జికల్ దాడులకు సంబంధించి తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని బదులిచ్చారు. అంతేకాకుండా […]

సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఆధారాలు లేవు : కేంద్ర రక్షణ శాఖ
Follow us on

యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన సర్జికల్ దాడులకు సంబంధించి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. 2004-14 మధ్య కాలంలో జరిగిన సర్జికల్ దాడుల వివరాలు కావాలంటూ రక్షణ శాఖ అధికారులను జమ్మూ ప్రాంతానికి చెందిన రోహిత్ చౌదరీ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా కోరారు. దీనికి స్పందించిన అధికారులు 2004-14 మధ్య జరిగిన సర్జికల్ దాడులకు సంబంధించి తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని బదులిచ్చారు. అంతేకాకుండా 2016 సెప్టెంబర్ 29న జరిగిన దాడుల వివరాలు మాత్రమే తమ వద్ద ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

సర్జికల్ దాడులే ప్రధాన అంశంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో స్పందించిన కాంగ్రెస్ పార్టీ నేతలు తమ హయాంలో ఆరు సర్జికల్ దాడులు చేసినప్పటికీ.. తేదీలతో సహా చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాక బీజేపీ పార్టీలా ఓట్ల కోసం వాటిని ఉపయోగించుకోలేదని కౌంటర్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. అయితే ఇప్పుడు సర్జికల్ దాడుల విషయంలో రక్షణ శాఖ అధికారులు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.