నెట్ ఫ్లిక్స్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఆ సిరీస్ కి బ్రేక్ !

| Edited By: Pardhasaradhi Peri

Sep 02, 2020 | 4:57 PM

ఇండియాలో అవినీతికి పాల్పడుతూ బ్యాంకులకు, ఇతర ఆర్ధిక సంస్థలకు కుచ్ఛు టోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన ఫ్రాడ్ స్టర్లను నేపథ్యంగా తీసుకుని నెట్ ఫ్లిక్స్ రూపొందించిన 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్' సిరీస్ కి బ్రేక్ పడింది..

నెట్ ఫ్లిక్స్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఆ సిరీస్ కి బ్రేక్ !
Follow us on

ఇండియాలో అవినీతికి పాల్పడుతూ బ్యాంకులకు, ఇతర ఆర్ధిక సంస్థలకు కుచ్ఛు టోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన ఫ్రాడ్ స్టర్లను నేపథ్యంగా తీసుకుని నెట్ ఫ్లిక్స్ రూపొందించిన ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ సిరీస్ కి బ్రేక్ పడింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ వంటివారి ‘కెరీర్లను’ ‘స్ఫూర్తి’ గా తీసుకుని డాక్యుమెంటరీ రూపంలో నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ని తీసింది. ఇది బుధవారం నుంచే ప్రసారం కావలసి ఉంది. అయితే బిహార్ లోని కోర్టు ఇందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ సంస్థ వాటిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెక్కింది. కానీ ఇక్కడా  దానికి రిలీఫ్ లభించలేదు. ‘మీరు ఇంతవరకూ రాకూడదని, కావాలంటే బీహార్ కోర్టు రూలింగ్ ని అక్కడి హైకోర్టులో సవాలు చేయవచ్చునని చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే అన్నారు.

ఈ సిరీస్ తన ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందని అంటూ సహారా అధినేత సుబ్రతా రాయ్ బిహార్ కోర్టులో వేసిన పిటిషన్ ను పురస్కరించుకుని కోర్టు ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. ఈ సిరీస్ పై మధ్యంతర స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టులో నెట్ ఫ్లిక్స్ సంస్థ పక్షాన వాదించిన సీనియర్ అడ్వొకేట్,  మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి.. ఈ విధమైన పిటిషన్లను కోర్టు లోగడ విచారించిదని అన్నారు. అయితే ఇందుకు సుబ్రతా రాయ్ లాయర్ వికాస్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా ఇదే ఇష్యుతో నెట్ ఫ్లిక్స్ పై హైదరాబాద్ లో కేసు నమోదై ఉంది. ఆ కేసును బదలాయించవలసిందిగా ముకుల్ రోహ్తగి కోరగా, దీన్ని పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ అన్నారు.