విజయవాడలో మళ్లీ లాక్‌డౌన్‌.. క్లారిటీ ఇచ్చిన కలెక్టర్..

|

Jun 24, 2020 | 10:58 AM

కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కూడా విజయవాడలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అనూహ్యంగా కొన్ని గంటల వ్యవధిలోనే...

విజయవాడలో మళ్లీ లాక్‌డౌన్‌.. క్లారిటీ ఇచ్చిన కలెక్టర్..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు పలు ప్రాంతాల్లో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని ఆయా జిల్లా కలెక్టర్లు నిర్ణయించారు. ఇప్పటికే తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో మరోసారి లాక్‌డౌన్ అమలుకు రంగం సిద్ధం కాగా.. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కూడా విజయవాడలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేసి దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేశారు. అయితే అనూహ్యంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతానికి లాక్ డౌన్ లేదని.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అన్నీ కూడా యథాతథంగానే కొనసాగుతాయని ఇంతియాజ్ స్పష్టం చేశారు. కాగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలకు చేరువలో ఉంది.