‘కోయిల ముందే కూసింది’ ! 2022 లో జరిగే యూపీ ఎన్నికలకు వ్యూహం ప్రకటించిన అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ లో 2022 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అప్పుడే తన వ్యూహం ప్రకటించారు. ఆ ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ..

కోయిల ముందే కూసింది ! 2022 లో జరిగే యూపీ ఎన్నికలకు వ్యూహం ప్రకటించిన అఖిలేష్ యాదవ్

Edited By:

Updated on: Nov 14, 2020 | 9:14 PM

ఉత్తరప్రదేశ్ లో 2022 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అప్పుడే తన వ్యూహం ప్రకటించారు. ఆ ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని తెలిపారు. 2017 లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీతో అంటకాగింది. దీపావళి సందర్భంగా అఖిలేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2022 ఎన్నికల్లో చిన్న పార్టీలతో అవగాహన కుదుర్చుకోవడానికి తమ పార్టీ రెడీగా ఉందని, కానీ పెద్ద పార్టీలకు తలుపులు మూసేశామని అన్నారు. ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం లేదని అఖిలేష్ ప్రస్తుతానికి భావిస్తున్నట్టు కనబడుతోంది. కాగా మరో రెండేళ్లలో జరగనున్న ఎన్నికలకు ఇప్పటినుంచే ఎందుకింత హంగామా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us