గవర్నర్ కు ఎమ్మెల్యేల జాబితా ఇచ్చాం, రేపు ప్రమాణ స్వీకారం చేస్తా, నితీష్ కుమార్ , ఇక అభివృధ్దే మా మంత్రం

బీహార్ సీఎం గా నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రం మరింత అభివృద్ది చెందాలన్నదే తమ 'మంత్రమని' ఆయన ఆదివారం వెల్లడించారు. రాజ్ భవన్ కు వెళ్లి తమకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను..

గవర్నర్ కు ఎమ్మెల్యేల జాబితా ఇచ్చాం, రేపు ప్రమాణ స్వీకారం చేస్తా, నితీష్ కుమార్ , ఇక అభివృధ్దే  మా మంత్రం

Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 15, 2020 | 7:00 PM

బీహార్ సీఎం గా నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రం మరింత అభివృద్ది చెందాలన్నదే తమ ‘మంత్రమని’ ఆయన ఆదివారం వెల్లడించారు. రాజ్ భవన్ కు వెళ్లి తమకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను ఆయనకు సమర్పించామని ఆయన చెప్పారు. రేపు ఎవరెవరు ప్రమాణం చేస్తారో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం కేబినెట్ సమావేశమై శాసన సభను ఎప్పుడు సమావేశపరచాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. బీహార్ ప్రజలు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు.. ఇక వికాస్ (ప్రగతి) పై దృష్టి పెట్టి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటాం అని నితీష్ కుమార్ చెప్పారు.

నితీష్ ను ఎన్డీయే తమ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఈ మధ్యాహ్నం ఎన్నుకుంది. ఈ విషయాన్ని కూడా గవర్నర్ కు తెలియజేసినట్టు ఎన్డీయే వర్గాలు వెల్లడించాయి.  నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కానున్న నితీష్ ఇక తన కేబినెట్ లో ఎవరిని మంత్రులుగా చేర్చుకుంటారో, ఎవరికి ఏయే పదవులు కేటాయిస్తారో తెలియవలసి ఉంది.