నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు… ఈ నెల 16 న సీఎంగా ఆరోసారి బాధ్యతలు..!

|

Nov 13, 2020 | 2:02 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన ఎన్డీయే కూటమి అధికార పట్టాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు... ఈ నెల 16 న సీఎంగా ఆరోసారి బాధ్యతలు..!
Follow us on

#nitishkumar swearing as cm: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన ఎన్డీయే కూటమి అధికార పట్టాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా బీజేపీ అధిక స్థానాల్లో గెలుపొందినప్పటికీ పొత్తులో భాగంగా నితీష్ కుమార్‌నే సీఎం చేయడానికి బీజేపీ ముందుకొచ్చింది. ఈనెల 16న బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16 న ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణం చేయనున్నారు. నితీష్ కుమార్ ఏడోసారి బిహార్ ముఖ్యమంత్రి కానున్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం బిహార్ చేరుకుని ప్రభుత్వం ఏర్పాటుపై నితీష్‌ కుమార్‌తో తుది కసరత్తు మొదలుపెట్టింది.

బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేకి 125 సీట్లు దక్కాయి. ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమికి 110 సీట్లకే పరిమితమైంది. ఎల్జేపీ 1, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించగా, జేడీయూ 43 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, సీపీఐఎంఎల్ 11, ఎంఐఎం 5, హెచ్ఏఎంఎస్ 4, వీఐపీ 4, సీపీఎం 3, సీపీఐ 2, ఎల్జేపీ ఒక స్థానంలో గెలిచాయి. నితీష్ కుమార్ బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి కావల్సిన సాధారణ మెజారిటీ 122 ను ఎన్డీయే సాధించడంతో ముఖ్యమంత్రి సీటు జేడీయూ బీజేపీలకు లైన్ క్లియర్ అయ్యింది. గతంలో 2000 (8 రోజులు), 2005, 2010, 2015, 2017లో మొత్తం ఐదుసార్లు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు ఆరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.