Breaking News : హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. తొమ్మిది మంది మృతి

హైదరాబాద్‌ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో విషాదం చోటుచేసుకుంది. నగరంలో కురుస్తున్న వర్ష బీభత్సానికి గౌస్‌ నగర్‌లో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 9 మంది మృతిచెందారు. ఎత్తైన ప్రదేశంపై ఉన్న ఇళ్లపై...

Breaking News : హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. తొమ్మిది మంది మృతి

Updated on: Oct 14, 2020 | 7:04 AM

Wall Collapses :హైదరాబాద్‌ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో విషాదం చోటుచేసుకుంది. నగరంలో కురుస్తున్న వర్ష బీభత్సానికి గౌస్‌ నగర్‌లో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 9 మంది మృతిచెందారు. ఎత్తైన ప్రదేశంపై ఉన్న ఇళ్లపై బండరాళ్లు జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో ఐదుగురు మృతిచెందగా.. మరో ఇంట్లో నలుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలంలో ఫలక్‌నుమా ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

బండ్లగూడ మహ్మదియా నగర్‌లోని ఓ పహిల్వాన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌ గ్రానైట్‌ గోడ కూలి పక్కనే ఉన్న రెండిళ్లపై పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో రెండు నెలల చిన్నారి ఉన్నట్టు సమాచారం. మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన వారే. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని పోలీసులు మొగల్‌పురలోని అస్రా ఆస్పత్రికి తరలించారు.

Follow Us