AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో పలు చోట్ల సోదాలు: ఎన్ఐఏ

గతనెలలో తమిళనాడులో మహ్మద్ ఆసిఫ్, సైదుల్లా అనే ఇద్దరు వ్యక్తుల నివాసాలపై దాడులు చేసిన ఎన్ఐఏ, తాజాగా ఏకకాలంలో 10 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. మహ్మద్ ఆసిఫ్, సైదుల్లా ఐసిస్ మద్దతుదారులన్న ఆరోపణలతో దాడులు చేసిన ఎన్ఐఏ అప్పట్లో కీలక సమాచారం రాబట్టింది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు తమిళనాడులో పది ప్రాంతాల్లో సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. రామనాథపురం, సేలం, చిదంబరం, లాలాపేట, ముత్తుపేట, దేవీపట్నం తదితర ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు అనుమానితుల నివాసాలను జల్లెడపట్టారు. ఈ […]

తమిళనాడులో పలు చోట్ల సోదాలు: ఎన్ఐఏ
TV9 Telugu Digital Desk
|

Updated on: May 30, 2019 | 6:14 PM

Share

గతనెలలో తమిళనాడులో మహ్మద్ ఆసిఫ్, సైదుల్లా అనే ఇద్దరు వ్యక్తుల నివాసాలపై దాడులు చేసిన ఎన్ఐఏ, తాజాగా ఏకకాలంలో 10 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. మహ్మద్ ఆసిఫ్, సైదుల్లా ఐసిస్ మద్దతుదారులన్న ఆరోపణలతో దాడులు చేసిన ఎన్ఐఏ అప్పట్లో కీలక సమాచారం రాబట్టింది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు తమిళనాడులో పది ప్రాంతాల్లో సోదాలు జరిపినట్టు తెలుస్తోంది.

రామనాథపురం, సేలం, చిదంబరం, లాలాపేట, ముత్తుపేట, దేవీపట్నం తదితర ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు అనుమానితుల నివాసాలను జల్లెడపట్టారు. ఈ దాడుల్లో 3 ల్యాప్ టాప్ లు, 3 హార్డ్ డిస్కులు, 16 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు, 2 పెన్ డ్రైవ్ లు, 6 మెమరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలో ఉగ్రవాదులు రక్తపుటేర్లు పారించిన నేపథ్యంలో ఉగ్రవాదుల తదుపరి లక్ష్యం భారత్ అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏ ఒక్క అనుమానితుడ్నీ వదలకూడదని ఎన్ఐఏ వర్గాలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Follow Us
ఆగస్టు 27 రాశిఫలాలు: ఆ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్..
ఆగస్టు 27 రాశిఫలాలు: ఆ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ