
ఐసీస్ అనుమానిత ఉగ్రవాది రియాస్ అబూబకర్ అలియాస్ అబూ దుజాన్‌ను ఇవాళ కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల ఘటనకు సూత్రధారి అయిన జహ్రాన్ నుంచి ఉగ్రవాది రియాస్ ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం రియాస్‌ను ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జహ్రాన్ హసిమ్ ప్రసంగాలు, వీడియోలను ఫాలో అవుతున్నట్లు రియాస్ పోలీసులకు వెల్లడించాడు. గతేడాది నుంచి నిషేధిత జకీర్ నాయక్ ప్రసంగాలను కూడా వింటున్నట్లు ఎన్ఐఏ పోలీసులకు తెలిపాడు. అయితే కేరళలో కూడా శ్రీలంక తరహాలో సూసైడ్ దాడులకు ప్లానేసినట్లు రియాస్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.