Newest Cricket Format : ఒకప్పుడు 50 ఓవర్ల వన్డే మ్యాచ్ వస్తుందంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయేవారు. ఆ తరవాత అది 20 ఓవర్లకు వచ్చింది. టి20లు వచ్చిన తరవాత 50 ఓవర్లకు కాస్త ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ధనాధన్ గేమ్‌తో ఈ పొట్టి ఫార్మాట్ అంతలా ఆకట్టుకుంటోంది. కానీ ఇప్పుడు దానికన్నా పొట్టి ఫార్మాట్ వచ్చేస్తోంది. అదే లిమిటెడ్ ఓవర్ల క్రికెట్.
డిసెంబర్24 నుంచి స్టార్లలో నయా క్రికెట్ టోర్నీ మొదలు కానుంది. ఇందులో కేవలం 6 స్టార్ ఆటగాళ్లతో ఈ లీగ్ జరుగుతుంది. ఇందులో యూవీ, మోర్గన్, పీటర్సన్, రస్సెల్, గేల్, రషీద్ ఖాన్ పాల్గొననున్నారు. మొత్తం మ్యాచ్ లో 15 బంతుల ఇన్నింగ్స్ 4 ఉంటాయి. లీగ్ లో మొత్తం 16 మ్యాచ్ లు జరుగుతాయి. ఒక్క మ్యాచ్ లో ఇద్దరే ఆడతారు. రన్స్ కోసం ప్రత్యేక రూల్స్ ఉంటాయి. జనవరి 1న ఫైనల్ తర్వాత ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిని విజేతగా ప్రకటిస్తారు.