సుమలత ట్వీట్ పై నెటిజన్ల ఆగ్రహం..

సీనీ నటి, మండ్యా స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం..సుమలత చేసిన ఓ ట్వీట్ అందరికి ఆగ్రహం తెప్పించింది. బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ మరణంతో బీజేపీ శ్రేణులు ఆవేదనలో ఉండగా సుమలత పోస్ట్ చేసిన ఓ ఫోటో అందరికి కోపం తెప్పించింది.  ఢిల్లీలో కర్నాటక భవన్ లో సీఎం యడ్యూరప్ప, కేంద్ర మంత్రులు డీవీ సదానందగౌడ తదితరులతో సమావేశంలో […]

సుమలత ట్వీట్ పై నెటిజన్ల ఆగ్రహం..

Updated on: Aug 08, 2019 | 3:07 PM

సీనీ నటి, మండ్యా స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం..సుమలత చేసిన ఓ ట్వీట్ అందరికి ఆగ్రహం తెప్పించింది. బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ మరణంతో బీజేపీ శ్రేణులు ఆవేదనలో ఉండగా సుమలత పోస్ట్ చేసిన ఓ ఫోటో అందరికి కోపం తెప్పించింది.  ఢిల్లీలో కర్నాటక భవన్ లో సీఎం యడ్యూరప్ప, కేంద్ర మంత్రులు డీవీ సదానందగౌడ తదితరులతో సమావేశంలో పాల్గొన్న ఫోటోను అర్ధరాత్రి 12 గంటల 18 నిమిషాల సమయంలో సుమలత తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు..రీట్వీట్ లతో మండిపడ్డారు. దేశానికి ఎంతో సేవ చేసిన సుష్మా స్వరాజ్ మృతి చెందితే ఆమెను ఙ్ఞాపకం చేసుకోవాల్సిన సమయంలో ఈ ట్వీట్ చేయడం అంత అవసరమా..మేడం ? అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో వెంటనే తేరుకున్న సుమలత ..సుష్మాస్వరాజ్ మరణం దేశానికి తీరని లోటు..అంటూ మరో ట్వీట్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us