నేపాల్ సర్కార్ కీలక నిర్ణయం.. రోగుల ఖర్చులన్నీ జనమే భరించాలి

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సోకిన ప్రజలందరి ఖర్చులను భరించకూడదని నిర్ణయించింది.

నేపాల్ సర్కార్ కీలక నిర్ణయం.. రోగుల ఖర్చులన్నీ జనమే భరించాలి
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 19, 2020 | 7:48 PM

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సోకిన ప్రజలందరి ఖర్చులను భరించకూడదని నిర్ణయించింది. అలాగే ఇంట్లో ఒంటరిగా ఉండి కరోనా సోకి మరణించిన వారిని పాతిపెట్టకూడదని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. కేపీ శర్మ ఒలి నేతృత్వంలోని కమిటీ గత వారం నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్ ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.

కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన, కొన్ని ప్రమాణాలను పూర్తిచేసే వ్యక్తుల జాబితా ప్రభుత్వం నుండి సౌకర్యాలను పొందుతుందని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకటించారు. కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన, కొన్ని ప్రమాణాలను పూర్తి చేసే వ్యక్తుల జాబితా ప్రభుత్వం నుండి సౌకర్యాలను పొందుతారిని వెల్లడించింది. తాజా నిర్ణయం ఆదివారం నుండే అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆసుపత్రులు, ప్రయోగశాలలకు అమల్లోకి వచ్చింది. కొత్త నిర్ణయం జనాభాలో 25 శాతానికి పైగా కొవిడ్ పరీక్షలను నిలిపివేసింది.

“ఆర్థికంగా వెనుకబడిన, నిస్సహాయమైన, ఒంటరి మహిళలు, సీనియర్ సిటిజన్లు, ఫ్రంట్-లైన్ ఆరోగ్య కార్యకర్తలు, శానిటైజేషన్ కార్మికులు, భద్రతా సిబ్బంది, ప్రమాదానికి గురయ్యే జోన్లో పనిచేస్తున్న పౌర సేవకులు మాత్రమే ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని నేపాల్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అలాగే, వారికి మాత్రమే ప్రభుత్వం చికిత్స అందిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ పైన పేర్కొన్న వ్యక్తులు ఏదైనా సంస్థ నుండి బీమా పాలసీని కలిగి ఉంటే, అప్పుడు వారి భీమా పాలసీ నుండి ఖర్చులు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం తెలిపిందిప. పరీక్షలు, చికిత్స ఖర్చులను భరిస్తుంది. ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వ ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ జగేశ్వర్ గౌతమ్ ఆదివారం సాధారణ విలేకరుల సమావేశంలో వివరించారు.

కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం డెడ్ బాడీ మేనేజ్మెంట్ ను అనుసరించి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మరణిస్తే కుటుంబ సభ్యులను వారి బంధువుల మృతదేహాన్ని ఖననం చేసేలా చేసింది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 60 ఏళ్ల పైబడిన వారితో పాటు చిన్నపిల్లలు పాల్గొనకుండా నిషేధం విధించారు.