నెల్లూరు జిల్లా వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత..ఒకరు మృతి

|

Dec 12, 2020 | 3:40 PM

నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తూ ఆరుగురు కూలీలు ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు.

నెల్లూరు జిల్లా వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత..ఒకరు మృతి
Follow us on

నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తూ ఆరుగురు కూలీలు ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు మృతి చెందగా… మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  పొదలకూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బాధితులంతా ఇటీవలే కోల్‌కతా నుంచి వచ్చారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే వీరు అస్వస్థతకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. వైద్య నిపుణులు అస్వస్థతకు గల కారణాలు తెలుసుకోడానికి పలు టెస్టులు చేస్తున్నారు. అయితే ఏలూరు అంతుచిక్కని వ్యాధి తరహా వ్యాధి ఏమైనా వీరికి సోకిందేమో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఏమి లేవని కేవలం..ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు .

Also Read :

ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం, బాంబులా పేలిన రియాక్టర్

యాభై ఎకరాల పొలాన్ని పేకాటలో తగలెట్టాడు, చివరికి వ్యసనాన్ని వీడలేక దొంగగా మారి..

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !