NEET, JEE Mains Exams Schedule: జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13వ తేదీన నీట్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. తొలుత ఈ పరీక్షలను జూలైలో నిర్వహించాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా అది కాస్తా వాయిదా పడ్డాయి.
ఇక జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాలను 570-660కి, నీట్(యూజీ) కేంద్రాలను 2546-3843కి పెంచినట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అటు జేఈఈ మెయిన్స్ పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసిన ఎన్‌టీఏ.. త్వరలోనే నీట్ యూజీ 2020 అడ్మిట్ కార్డులను కూడా రిలీజ్ చేస్తామని చెప్పింది. కాగా, కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు సామాజిక దూరం పాటించేలా పరీక్షా కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు.
Also Read:
వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!