
భారతదేశ ఏకైక యుద్ధ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నేవీ అధికారి మృత్యువాత పడ్డారు. కర్నాటక కార్వార్ ఓడరేవుకు చేరుకునే సమయంలో నౌకలో మంటలు చెలరేగాయి. దీంతో మంటలను అదుపుచేసేందుకు లెఫ్టినెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను వెంటనే కార్వార్ నేవీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.