AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసిస్‌తో హైదరాబాద్ యువకుడికి లింక్..

యువకుడితోపాటు మరో నలుగురిపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA) ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన యువకుడు కూడా ఉన్నాడని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ న్యాయస్థానంలో ఛార్జిషీట్‌ సమర్పించినట్టు ఎన్‌ఐఏ అధికారి వెల్లడించారు.

ఐసిస్‌తో హైదరాబాద్ యువకుడికి లింక్..
Sanjay Kasula
|

Updated on: Sep 03, 2020 | 12:30 PM

Share

టెర్రర్ లింక్‌తో మరోసారి హైదరాబాద్ వార్తల్లోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన యువకుడికి  కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ (ISIS‌)కు అనుబంధ సంస్థ ‘ఇస్లామిక్‌ స్టేట్‌ ఖోరాసన్‌ ప్రావిన్స్‌’తో సంబంధాలున్నట్లుగా తేలింది. ఈ యువకుడితోపాటు మరో నలుగురిపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA) ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన యువకుడు కూడా ఉన్నాడని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ న్యాయస్థానంలో ఛార్జిషీట్‌ సమర్పించినట్టు ఎన్‌ఐఏ అధికారి వెల్లడించారు.

ఢిల్లీ నివాసులైన జహాన్‌ఝాయిబ్‌ సమీ, హీనా బషీర్‌ దంపతులతో పాటు… హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్‌, పుణెకు చెందిన సదియా అన్వర్‌ షేక్‌, నబీస్‌ సిద్ధిక్‌ ఖత్రిలను అధికారులు ఇందు కీలక నిందితులుగా పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థతో కలిసి… వివిధ మతాలవారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహ చర్యలకు దిగడం, జనసమ్మర్ద ప్రదేశాల్లో పేలుళ్లకు పాల్పడటం వంటి లక్ష్యాలతో వీరు పనిచేస్తున్నట్టు అధికారులు ఆరోపించారు.

ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ‘సావత్‌ అల్‌-హింద్‌..  వాయిస్‌ ఆఫ్‌ ఇండియాగా మరోపేరు. ’ మ్యాగజైన్‌ ఫిబ్రవరి-2020 సంచికను వీరు ప్రచురించారు. దీంతో మార్చి 8న ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో, అసలు ఉగ్ర కోణం బయటకొచ్చింది.

Follow Us
తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..
తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..
చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణ నిర్ణ
చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణ నిర్ణ
కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..
కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..
అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..
అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..
భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల ట్రాప్ షూటింగ్‌లో మెరిసిన త్రయం
భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల ట్రాప్ షూటింగ్‌లో మెరిసిన త్రయం
వేడి వేడి అన్నంలోకి.. కారం కారం టమాటా ఉల్లికారం, నోరూరడం గ్యారంటీ
వేడి వేడి అన్నంలోకి.. కారం కారం టమాటా ఉల్లికారం, నోరూరడం గ్యారంటీ
సామాన్యులపై వార్ ఎఫెక్ట్.. పెరగనున్న ఆ వస్తువుల ధరలు..
సామాన్యులపై వార్ ఎఫెక్ట్.. పెరగనున్న ఆ వస్తువుల ధరలు..
వైన్‌ షాప్‌లో దూరిన కోతి.. మందు బాటిల్‌ ఎత్తి దించకుండా తాగేసింది
వైన్‌ షాప్‌లో దూరిన కోతి.. మందు బాటిల్‌ ఎత్తి దించకుండా తాగేసింది
IND vs WI 2nd ODI: రెండో వన్డేలో ఓ మార్పుతో బరిలోకి భారత జట్టు..?
IND vs WI 2nd ODI: రెండో వన్డేలో ఓ మార్పుతో బరిలోకి భారత జట్టు..?
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!