ఫొని బీభత్సానికి ముందు, తర్వాత.. ఫొటోలు ఇదిగో..!

| Edited By:

May 09, 2019 | 1:19 PM

1999 సంవత్సరం తర్వాత అదే స్థాయిలో వచ్చిన తుఫాన్ ఫొని. ఈ తుఫానుల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరగగా.. చాలా మంది మృత్యువాత పడ్డారు. గత వారంలో వచ్చిన ఫొని తుఫాన్ ఒడిశా, బెంగుళూరు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను వణికించింది. అధికారుల ముందు జాగ్రత్త చర్యలతో చాలా వరకు నష్టం కలగకుండా చూడగలిగారు. అయినప్పటికీ 40మంది మృతి చెందారు. సుమారు 200 కిలోమీట‌ర్ల వేగంతో పెనుగాలులు వీచడంతో.. విద్యుత్తు స‌ర‌ఫ‌రా దెబ్బతినగా అంతకు మించి జరిగిన బీభత్సం […]

ఫొని బీభత్సానికి ముందు, తర్వాత.. ఫొటోలు ఇదిగో..!
Follow us on

1999 సంవత్సరం తర్వాత అదే స్థాయిలో వచ్చిన తుఫాన్ ఫొని. ఈ తుఫానుల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరగగా.. చాలా మంది మృత్యువాత పడ్డారు. గత వారంలో వచ్చిన ఫొని తుఫాన్ ఒడిశా, బెంగుళూరు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను వణికించింది. అధికారుల ముందు జాగ్రత్త చర్యలతో చాలా వరకు నష్టం కలగకుండా చూడగలిగారు. అయినప్పటికీ 40మంది మృతి చెందారు. సుమారు 200 కిలోమీట‌ర్ల వేగంతో పెనుగాలులు వీచడంతో.. విద్యుత్తు స‌ర‌ఫ‌రా దెబ్బతినగా అంతకు మించి జరిగిన బీభత్సం తెలిసిందే. భువ‌నేశ్వ‌ర్‌, క‌ట‌ర్‌, పూరీ లాంటి పట్ట‌ణాలు అంధ‌కారంలో మునిగిపోయాయి.

అయితే.. ఫొని తుఫాన్‌కు ముందు, ఆ త‌ర్వాత న‌గ‌రాల్లో ఏర్పడిన పరిస్థితిపై నాసా సంస్థ ఫొటోలతో సహా ఓ ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేసింది. తుఫాన్ రాక ముందు విద్యుత్ దీపాల‌తో న‌గ‌రాలు వెలిగిపోతున్న‌ ఫోటోల‌ను నాసా రిలీజ్ చేసింది. తుఫాన్ త‌ర్వాత క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో అంధ‌కారంగా మారిన న‌గ‌రాల ఫోటోల‌ను కూడా నాసా విడుదల చేసింది. ఏప్రిల్ 30వ తేదీన, ఆ త‌ర్వాత మే 5వ తేదీన తీసిన ఫోటోలను నాసా ఎర్త్ సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సౌమి ఎన్‌పీపీ శాటిలైట్‌లో ఉన్న విజిబుల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీట‌ర్ సూట్ నుంచి ఈ ఫోటోల‌ను తీసినట్టు ట్వీట్‌లో వెల్లడించారు.