ఎమ్మెల్యే రాజయ్యకు తప్పిన ప్రమాదం.. ఇసుక లారీ అకస్మాత్తుగా రోడ్ పైకి రావడంతో జరిగిన యాక్సిడెంట్

|

Dec 14, 2020 | 2:57 AM

స్టేష‌న్‌ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే రాజ‌య్య‌కు త్రుటిలో ప్రాణాపాయం త‌ప్పింది. ఆదివారం త‌న కారులో జనగాం వెళ్తుండ‌గా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఎమ్మెల్యే రాజయ్య వాహనానికి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే రాజయ్యకు తప్పిన ప్రమాదం.. ఇసుక లారీ అకస్మాత్తుగా రోడ్ పైకి రావడంతో జరిగిన యాక్సిడెంట్
Follow us on

స్టేష‌న్‌ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే రాజ‌య్య‌కు త్రుటిలో ప్రాణాపాయం త‌ప్పింది. ఆదివారం త‌న కారులో జనగాం వెళ్తుండ‌గా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఎమ్మెల్యే రాజయ్య వాహనానికి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇసుక లారీలు రోడ్ పై అకస్మాత్తుగా రావడంతో పోలీసు కాన్వాయ్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేసాడు. దీంతో ఎమ్మెల్యే రాజయ్య కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రాజ‌య్య‌కు ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే వాహనాన్ని కాన్వాయ్ వెనుక నుంచి పోలీస్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే వాహనానికి ముందు బంపర్, మిర్రర్ ధ్వంసం అయ్యాయి. ప్రమాదం నుంచి త్రుటిలో ఎమ్మెల్యే రాజయ్య తప్పించుకున్నారు. ప్రమాదంలో స్వల్పంగా ధ్వంసమైంది ఎమ్మెల్యే రాజయ్య వాహనం.