Myanmar’s Aung Suu Kyi Detained: మయన్మార్‌లో ఏడాది ఎమర్జెన్సీ.. అంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకున్న సైనికులు

మయన్మార్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.  అక్కడ సైనికులు తిరుబాటు బావుటా ఎగరవేశారు.. ప్రముఖ నేత అంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకున్నారు, ఎన్నికల అనంతరం అక్కడ ప్రభుత్వానికి..

Myanmars Aung Suu Kyi Detained: మయన్మార్‌లో ఏడాది ఎమర్జెన్సీ.. అంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకున్న సైనికులు

Updated on: Feb 01, 2021 | 8:51 AM

Myanmar’s Aung Suu Kyi Detained: మయన్మార్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అక్కడ సైనికులు తిరుబాటు బావుటా ఎగరవేశారు.. ప్రముఖ నేత అంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకున్నారు. దేశంలో ఏడాది పాటు ఎమర్జెన్సీ ప్రకటించింది మిలటరీ. ఎన్నికల అనంతరం అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మిలటరీకి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున సైనికులు దాడి జరిపి నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ నేత అంగ్ సాన్ సూకీ తో పాటు ఆ పార్టీ కి చెందిన ఇతర సీనియర్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ ప్రతినిధి సోమవారం తెలిపారు.

అయితే ఈ సంఘటనకు ప్రజలు స్పందించవద్దని.. చట్ట ప్రకారం పనిచేయాలని ఎన్‌ఎల్‌డి ప్రతినిధి తెలిపారు. ప్రధాన నగరమైన యాంగోన్ సిటీ హాల్ బయట సైనికులను మోహరించినట్లు ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు.దేశమంతటా ఇంటర్‌నెట్ సేవలను ఆర్మీ నిలిపివేసింది.

అయితే మిలటరీ కుట్రపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యం నెలకొల్పే దిశగా జరిగిన ప్రయత్నాలను అడ్డుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పింది. వెంటనే ఎన్నికల ఫలితాల ప్రకారం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, లేదంటే తాము జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ప్రజలు ఎన్నుకున్న నేత అంగ్ సాన్ సూకీ సహా ఇతర నేతలను విడుదల చేయాలని ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది.

Also Read: పల్లెల్లో ఎలక్షన్ కోడ్ అమలు.. నేటి నుంచి పట్టణాల్లో ప్రారంభం కానున్న ఇంటింటికీ రేషన్..