Ration Door Delivery: పల్లెల్లో ఎలక్షన్ కోడ్ అమలు.. నేటి నుంచి పట్టణాల్లో ప్రారంభం కానున్న ఇంటింటికీ రేషన్..

ఏపీలో నేటి నుంచి సరికొత్త పథకం ప్రారంభం కానుంది. పట్టణాల్లో పేదలకు ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. వాస్తవంగా ఈ పథకం పైలెట్‌ ప్రాజెక్టు..

Ration Door Delivery: పల్లెల్లో ఎలక్షన్ కోడ్ అమలు..  నేటి నుంచి పట్టణాల్లో ప్రారంభం కానున్న ఇంటింటికీ రేషన్..
Follow us

|

Updated on: Feb 01, 2021 | 6:57 AM

Ration Door Delivery: ఏపీలో నేటి నుంచి సరికొత్త పథకం ప్రారంభం కానుంది. పట్టణాల్లో పేదలకు ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. వాస్తవంగా ఈ పథకం పైలెట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైగా అమలవుతుంది. ఇప్పుడు రాష్ట్రం అంతటా ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. అయితే పంచాయితీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని నిలుపుదల చేయాలనీ ఎస్ఈసి రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు.

ఆ ఉత్తరానికి ప్రభుత్వం సవివరంగా ఎస్‌ఈసీకి సమాధానమిచ్చింది. పేదలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని, ఈ దేశంలో ప్రతి పౌరునికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, ఇందులో భాగంగానే అర్హత కలిగిన పేదలందరికీ వారి ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యం అందజేసేందుకు ముందుకు అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం ఆ లేఖలో వివరించింది. ఇప్పుడు రాష్ట్రం అంతటా ఇచ్చేందుకు వీలుగా అనుమతించాలని కోరింది. ఈ మేరకు హైకోర్టులో ఆదివారం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విషయమై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే నుంచి ఇంటింటికీ రేషన్‌ అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రమంతా ఇవ్వడానికి ఇప్పటికే 9,260 మొబైల్‌ వాహనాలను సీఎం జగన్ గత నెల 21న ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..