మయన్మార్‌లో ఆంగ్‌సాన్‌ సూకీకే విజయం దక్కే అవకాశం

|

Nov 09, 2020 | 11:10 AM

మయన్మార్‌ (బర్మా)లో ఆంగ్‌సాన్‌ సూకీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. నిన్న జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ నేషనల్‌ లీగ్‌ డెమొక్రాటిక్‌ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచే సంకేతాలు కనిపిస్తున్నాయి.. జనం ఓటు వేసేందుకు తెగ ఉత్సాహం చూపడమే కాదు.. మెజారిటీ ప్రజలు ఆంగ్‌సాన్‌ సూకీ వైపే మొగ్గుచూపారు. వీటిని పరిగణనలోకి తీసుకునే రాజకీయ విశ్లేషకులు సూకీ విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు.. మయన్మార్‌ ప్రజలు సుమారు అయిదు దశాబ్దాల పాటు సైనిక పాలనలోనే మగ్గిపోయారు.. […]

మయన్మార్‌లో ఆంగ్‌సాన్‌ సూకీకే విజయం దక్కే అవకాశం
Follow us on

మయన్మార్‌ (బర్మా)లో ఆంగ్‌సాన్‌ సూకీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. నిన్న జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ నేషనల్‌ లీగ్‌ డెమొక్రాటిక్‌ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచే సంకేతాలు కనిపిస్తున్నాయి.. జనం ఓటు వేసేందుకు తెగ ఉత్సాహం చూపడమే కాదు.. మెజారిటీ ప్రజలు ఆంగ్‌సాన్‌ సూకీ వైపే మొగ్గుచూపారు. వీటిని పరిగణనలోకి తీసుకునే రాజకీయ విశ్లేషకులు సూకీ విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు.. మయన్మార్‌ ప్రజలు సుమారు అయిదు దశాబ్దాల పాటు సైనిక పాలనలోనే మగ్గిపోయారు.. 2015లో మొదటిసారి ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి.. అందులో ఆంగ్‌సాన్‌ సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ పార్టీ ఘన విజయం సాధించింది.. ఇప్పుడూ అదే జరగబోతున్నదని అక్కడి మీడియా అంటోంది. దేశవ్యాప్తంగా ఆంగ్‌సాన్‌సూకీకి విశేష ఆదరణ ఉంది.. నిన్న జరిగిన ఎన్నికలల్లో కోవిడ్‌-19 నిబంధనలన్నీ పాటించారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే వారంతా మాస్క్‌లు ధరించి వచ్చారు.