భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. కులాలు, మతాల గోడల్ని చేరిపేస్తూ.. సాటి మనిషికి సాయపడాలనే సారాంశాన్ని ఇచ్చే ఘటనలు కోకొల్లలు. ముస్లింలు హిందువుల ఆలయాలకు… హిందువులు మసీదులకు వెళ్లిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా బెంగళూరులో ఓ ముస్లిం వ్యక్తి శ్రీరామనవమి వేడుకల్లో భాగస్వామ్యమయ్యాడు.
బెంగళూరు రాజాజీనగర్‌లో నివసించే సద్దాం హుస్సేన్ ఈ నెల 14న శ్రీరామ నవమివేడుకలు ఉండటంతో.. ఆలయాన్ని నీళ్లతో కడిగి శుభ్రం చేశాడు. గత మూడేళ్లగా ప్రతి శ్రీరామనవమికి వచ్చి ఆలయాన్ని శుభ్రం చేస్తున్నాడట. రామాలయాన్ని పరిశుభ్రం చేయడం ఎంతో ఆనందంగా ఉందని.. ప్రతి ఒక్కరూ తనను అభినందిస్తుంటే… ఆ సంతృప్తి చాలన్నారు.