పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ముమైత్‌ ఖాన్‌ ఫిర్యాదు

|

Oct 01, 2020 | 8:25 PM

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో సినీనటి ముమైత్‌ ఖాన్‌ ఫిర్యాదు చేశారు. రెండ్రోజులుగా తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై పోలీసులకు రాతపూర్వకంగా కంప్లైంట్‌ చేశారామె. క్యాబ్‌ డ్రైవర్‌ను మోసం చేయాల్సిన అవసరం తనకేంటని ముమైత్‌ఖాన్‌ ప్రశ్నించారు. కావాలనే కొందరు తన పరువుకు భంగం కలిగిలా ప్రచారం చేశారని ముమైత్‌ఖాన్‌ మండిపడ్డారు. తనపైనే క్యాబ్‌ డ్రైవర్‌ తప్పుడు ఆరోపణలు చేశాడని తెలిపింది. ర్యాష్‌ డ్రైవింగ్‌తో భయాందోళనకు గురిచేసినట్టు ఆమె మీడియాకు వెల్లడించారు. 12 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నా…తన గురించి […]

పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ముమైత్‌ ఖాన్‌ ఫిర్యాదు
Follow us on

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో సినీనటి ముమైత్‌ ఖాన్‌ ఫిర్యాదు చేశారు. రెండ్రోజులుగా తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై పోలీసులకు రాతపూర్వకంగా కంప్లైంట్‌ చేశారామె. క్యాబ్‌ డ్రైవర్‌ను మోసం చేయాల్సిన అవసరం తనకేంటని ముమైత్‌ఖాన్‌ ప్రశ్నించారు.

కావాలనే కొందరు తన పరువుకు భంగం కలిగిలా ప్రచారం చేశారని ముమైత్‌ఖాన్‌ మండిపడ్డారు. తనపైనే క్యాబ్‌ డ్రైవర్‌ తప్పుడు ఆరోపణలు చేశాడని తెలిపింది. ర్యాష్‌ డ్రైవింగ్‌తో భయాందోళనకు గురిచేసినట్టు ఆమె మీడియాకు వెల్లడించారు. 12 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నా…తన గురించి అందరికీ తెలుసన్నారు ముమైత్‌ఖాన్‌.

‘రెండు రోజుల నుంచి నాపై జరుగుతున్న ఆరోపణలపై ఫిర్యాదు ఇచ్చాను. నా మీద వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలు.12 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. నా క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. నాకు క్యాబ్ డ్రైవర్‌ని చీట్ చేయాల్సిన అవసరం ఏంటి. కొన్ని మీడియా చానళ్లు నా పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశాయి. నా క్యారెక్టర్‌ను‌ జడ్జ్ చేసే అధికారం మీకు ఎక్కడిది. ఒక్కసారి ఆలోచించండి. క్యాబ్ డ్రైవర్ కి 23500 చెల్లించాను. అయినా డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. డ్రైవర్‌ రాజు నన్ను వేధించాడు. ఫ్లయిట్స్‌లో పెట్స్‌ను అనుమతించకపోవడంతో క్యాబ్‌లో వెళ్లాను.’ అన్నారు ముమైత్‌.