అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను నిషేదించడంపై భారత్‌లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ట్విటర్ ఖాతాను నిషేదించడంపై ఆ దేశంలో మెజారిటీ వర్గం హర్షం వ్యక్తం చేశారు. అయితే భారత్‌లో మాత్రం ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, బలమైన ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఖాతాను నిషేధించడాన్ని తప్పుబడుతున్నారు. బడా సాంకేతక కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇదొక హెచ్చరిక వంటిదని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. నియంత్రణ లేని బడా సాంకేతిక కంపెనీల వల్ల పొంచి ఉన్న ముప్పును ఈ ఘటన సూచిస్తోందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఈ తరహా ఘటనలు జరగకుండా నిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
అమెరికా అధ్యక్షుడి ఖాతానే నిషేధించినప్పుడు ఇక ఎవరి ఖాతాలనైనా రద్దు చేయగలరని కామెంట్ చేశారు. దేశంలో ఐటీ విధానంలో మార్పులు సూచిస్తూ లోక్‌సభలో ఆయన చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా ట్విటర్‌లో ఉంచారు.
I’d urged govt to repeal IT Intermediaries Guidelines Rules during Zero Hr in Parliament
Intermediaries, as per their definition, can’t interfere in content on Social Media platforms. But Rules thereunder say otherwise
This anomaly must be addressed immediately#RegulateBigTech pic.twitter.com/kCyFIdnoAs
— Tejasvi Surya (@Tejasvi_Surya) January 9, 2021