టాలీవుడ్‌లో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళుతోన్న చిత్ర నిర్మాణాలు.. అద్దె పరికరాలు కూడా దొరకని పరిస్థితి.

|

Dec 28, 2020 | 8:43 PM

సినిమా ఇండస్ట్రీ గతంలో ఎన్నడూ చూడని అత్యంత గడ్డు పరిస్థితులను కరోనా సమయంలో ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడడం, థియేటర్లు మూత పడడంతో వెండి తెర మూగబోయింది. అయితే తాజాగా...

టాలీవుడ్‌లో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళుతోన్న చిత్ర నిర్మాణాలు.. అద్దె పరికరాలు కూడా దొరకని పరిస్థితి.
shootings in tollywood
Follow us on

Movie shootings speed up in tollywood: సినిమా ఇండస్ట్రీ గతంలో ఎన్నడూ చూడని అత్యంత గడ్డు పరిస్థితులను కరోనా సమయంలో ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడడం, థియేటర్లు మూత పడడంతో వెండి తెర మూగబోయింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి టాలీవుడ్‌ ఇండస్ట్రీ ఒక్కసారి వేగాన్ని పెంచింది.
కరోనా వేళ ఖాళీగా ఉన్న తారలు కొత్త కథలు వింటూ సినిమాలకు ఓకే చెప్పారు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకేసారి ఏకంగా 83 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో పాటు, పలు ఫీచర్‌ సినిమాల షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఒకేసారి ఇన్ని సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటుండడంతో కొన్ని చిత్రాలకైతే క్రేన్లు, ట్రాలీలు దొరకని పరిస్థితి నెలకొందంటేనే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి 2020లో మూగబోయిన థియేటర్లు ఇప్పుడు ఒకేసారి వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ని నింపనున్నాయన్న మాట. ఇదిలా ఉంటే ఎన్నడూ లేని విధంగా కొందరు స్టార్‌ హీరోలు సైతం ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తుండడం విశేషం. మరి 2021 టాలీవుడ్‌కు ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.