ఆప్ఘనిస్థాన్‌లో మసీదు పేల్చివేత.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్ లోని కాబూల్ నగరంలో మసీదు పేల్చివేత ఘటనలో ఇద్దరు మరణించగా

ఆప్ఘనిస్థాన్‌లో మసీదు పేల్చివేత.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 03, 2020 | 12:14 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్ లోని కాబూల్ నగరంలో మసీదు పేల్చివేత ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్ లోని వజీర్ అక్బర్ ఖాన్ మసీదును కొందరు గుర్తుతెలియని దుండగులు పేల్చివేశారు.

ఈ దారుణ సంఘటనలో మసీదులో ఉన్న ఇమాం మహమ్మద్ అయాజ్ నియాజీ మరణించారు.ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మసీదు పేల్చివేత అత్యంత అమానుష, దారుణ ఘటన అని, ఈ ఘటనలో అమాయకులైన వారు మరణించారని ఆప్ఘనిస్థాన్ అధ్యక్ష అధికార ప్రతినిధి సిద్ధిఖీ ఖండించారు.

Also Read: కరోనా పేషెంట్లకు ‘రెమిడీసివిర్’.. అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు ఇవ్వొచ్చు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu