పోలీసులను గజగజ వణికిస్తున్న కరోనా..

| Edited By: Pardhasaradhi Peri

May 13, 2020 | 4:16 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా డెబ్బై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. అందులో పోలీసులకు పెద్ద సంఖ్యలో […]

పోలీసులను గజగజ వణికిస్తున్న కరోనా..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా డెబ్బై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. అందులో పోలీసులకు పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ రావడంతో.. అంతా ఉలిక్కిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా కరోనా సోకింది. అందులో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రాణాలు కూడా కోల్పోయారు. బుధవారం నాటికి మొత్తం 1007 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్క ముంబై నగరంలోనే 394 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రావడం.. పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.