Lockdown In Uk:స్ట్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన యూకే ప్రభుత్వం.. మరింత కఠినంగా లాక్‌డౌన్‌..

|

Jan 04, 2021 | 7:02 AM

More Lockdown Measures In Uk: బ్రిటన్‌ కేంద్రంగా పుట్టుకొచ్చిన స్ట్రెయిన్‌ (కొత్త రకం) కరోనా ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని...

Lockdown In Uk:స్ట్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన యూకే ప్రభుత్వం.. మరింత కఠినంగా లాక్‌డౌన్‌..
Follow us on

More Lockdown Measures In Uk: బ్రిటన్‌ కేంద్రంగా పుట్టుకొచ్చిన స్ట్రెయిన్‌ (కొత్త రకం) కరోనా ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ కొత్త రకం కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
బ్రిటన్‌లో ఒక్క శనివారమే ఏకంగా 57 వేలకు పైగా కేసులు నమోదైన నేపథ్యంలో దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కీలక ప్రకటన చేశారు. యూకేలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చేది చలి కాలం కావడంతో ఇంకొన్ని వారాలపాటు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేయకతప్పదని తేల్చిచెప్పారు. కర్ఫ్యూ విధింపుతో పాటు కుటుంబాల కలయికపై నిషేధం విధించనున్నట్లు సమాచారం. ఇక పాఠశాలలను కూడా మూసేవేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈరోజు (సోమవారం) నుంచి బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్‌ పంపిణీ మొదలు కానుంది. ఇక బ్రిటన్‌తో పాటు అమెరికాలోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం ఒక్క రోజే 2.77 లక్షల కేసులు నమోదుకాగా.. మొత్తం మరణాలు 3.50 లక్షలకు చేరాయి.

Also Read: U.K.Variant Virus: మొన్నటి దాకా కరోనా… ఇప్పుడు యూకే కొత్త వైరస్… ఎన్ని దేశాలకు పాకిందో తెలుసా..?