రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న’రాధేశ్యామ్’ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తున్నాడు. దానితో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఈ లుక్ లో యమ రఫ్ గా కనిపిస్తున్నాడు ప్రభాస్. ఈ పోస్టర్ ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో భారీ తారాగణం ఉండనుందని తెలుస్తుంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నారని గతకొంతకాలంగా ప్రచారంజరుగుతుంది. అయితే ‘సలార్’ లో నటించేందుకు మోహన్ లాల్ భారీగా ముట్టజెప్పనున్నారని అంటున్నారు. ప్రభాస్ సినిమాలో నటించేందుకు మోహన్ లాల్ ఏకంగా 20 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని టాక్ నడుస్తుంది. ఇక ‘సలార్’ లో ప్రభాస్ డాన్ కు రైట్ హ్యాండ్ గా కనిపించనున్నాడని అంటున్నారు. డాన్ పాత్రకోసమే మోహన్ లాల్ ను ఎంపిక చేసారని ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు. ‘సలార్’ మూవీలో మోహన్ లాల్ నటిస్తే సినిమాకు మలయాళంలో కూడా మార్కెట్ దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి ప్రభాస్ సినిమాలో మోహన్ లాల్ కనిపిస్తారో లేదో చూడాలి.