ఇకపై కరెంట్ పోతే డబ్బులు ఖాతాలోకి.. కేంద్రం కొత్త రూల్!

|

Sep 03, 2019 | 3:32 AM

పవర్ కట్.. పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లో ఉన్నవారికి కూడా ఇదో పెద్ద సమస్యగా మారింది. గంటల తరబడి పవర్ కట్‌తో విసిగిపోయిన వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కేంద్రం సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది. కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగితే విద్యుత్ పంపిణీ సంస్థలకు భారీ జరిమానాలు విధించేలా కొత్త విద్యుత్ విధానాన్ని ప్రకటించబోతోంది. ఇప్పటికే ప్రతిపాదిత ఎలక్ట్రిసిటీ పాలసీని విద్యుత్ శాఖ కేంద్ర కేబినెట్‌కు పంపించినట్లు ఇన్‌సైడ్ టాక్. కొత్తగా అమలు కానున్న విద్యుత్ విధానం ప్రకారం.. […]

ఇకపై కరెంట్ పోతే డబ్బులు ఖాతాలోకి.. కేంద్రం కొత్త రూల్!
Follow us on

పవర్ కట్.. పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లో ఉన్నవారికి కూడా ఇదో పెద్ద సమస్యగా మారింది. గంటల తరబడి పవర్ కట్‌తో విసిగిపోయిన వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కేంద్రం సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది. కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగితే విద్యుత్ పంపిణీ సంస్థలకు భారీ జరిమానాలు విధించేలా కొత్త విద్యుత్ విధానాన్ని ప్రకటించబోతోంది. ఇప్పటికే ప్రతిపాదిత ఎలక్ట్రిసిటీ పాలసీని విద్యుత్ శాఖ కేంద్ర కేబినెట్‌కు పంపించినట్లు ఇన్‌సైడ్ టాక్.

కొత్తగా అమలు కానున్న విద్యుత్ విధానం ప్రకారం.. విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి. అలా కాకుండా వరుస పవర్ కట్స్‌తో వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తే సదరు పంపిణీ సంస్థలకు భారీ జరిమానాలు తప్పవు. అటు ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు గానీ అత్యవసరం కొద్దీ ముందస్తు సమాచారంతో విద్యుత్ నిలిపేయడం జరిగినప్పుడు తరుణాల్లో మాత్రం జరిమానాలు వర్తించవు. ఇక సరైన కారణం లేకుండా పవర్ కట్ చేస్తే.. భారీ జరిమానా తప్పదు. ఆ ఫైన్ డబ్బులు మొత్తం వినియోగదారుడి అకౌంట్‌లో జమ అవుతాయి. జరిమానా విధి విధానాలను స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అధారిటీ నిర్ణయించనుంది. అటు విద్యుత్ టారిఫ్‌ల్లో కూడా భారీగా మార్పులు చేస్తారని తెలుస్తోంది.

మరోవైపు విద్యుత్ సబ్సిడీని పంపిణీ సంస్థలకు కాకుండా నేరుగా వినియోగదారుల ఖాతాలోకి పంపించాలని ఎలక్ట్రిసిటీ పాలసీలో పొందుపరిచారు. దీని ద్వారా విద్యుత్‌ను ఆదా చేసే దిశగా వినియోగదారులను ప్రోత్సహించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఎక్కువ సబ్సిడీని పొందేందుకు వినియోగదారులు విద్యుత్‌ను ఎక్కువగా ఆదా చేస్తారని అంచనా వేస్తోంది. వచ్చే మూడేళ్లలో వినియోగదారులందరికీ స్మార్ట్, ప్రిపెయిడ్ మీటర్లను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా త్వరలోనే ఈ కొత్త విద్యుత్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.