దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీపై.. కేంద్రం కీలక ప్రకటన!

Modi Gives Clarity On NRC: దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తామని నాడు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన దగ్గర నుంచి నిరసనలు మిన్నంటాయి. ఇక తాజాగా ఎన్ఆర్సీ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీ అమలు చేసేందుకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని లోక్‌సభలో కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అటు ప్రధాని నరేంద్రమోదీ కూడా గతంలో దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీ‌పై ఎలాంటి చర్చా […]

దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీపై.. కేంద్రం కీలక ప్రకటన!

Modi Gives Clarity On NRC: దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తామని నాడు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన దగ్గర నుంచి నిరసనలు మిన్నంటాయి. ఇక తాజాగా ఎన్ఆర్సీ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీ అమలు చేసేందుకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని లోక్‌సభలో కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

అటు ప్రధాని నరేంద్రమోదీ కూడా గతంలో దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీ‌పై ఎలాంటి చర్చా జరపలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌ఆర్‌సీ‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తమ కేబినెట్, పార్లమెంట్‌లో దీనిపై చర్చించలేదని చెప్పారు. కేవలం సుప్రీం కోర్టు ఆదేశాలతోనే అసోం‌లో దీన్ని అమలు చేశామని ఆయన అన్నారు. ఇక తాజాగా కేంద్రహోంశాఖ నుంచి లోక్‌సభలో కూడా క్లారిటీ రావడంతో.. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రం చెక్ పెట్టిందనే చెప్పాలి.

Published On - 5:41 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu