చెరుకు రైతులకు మోదీ కేబినెట్ శుభవార్త

|

Oct 29, 2020 | 5:19 PM

చెరుకు ఉత్పత్తి చేసే రైతాంగానికి, దాని ద్వారా చక్కెర ఉత్పత్తి చేసే పారిశ్రామిక వర్గాలకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. అదే సమయంలో పెట్రో ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితిని కొంత మేరకు తగ్గించే నిర్ణయం తీసుకుంది.

చెరుకు రైతులకు మోదీ కేబినెట్ శుభవార్త
Follow us on

Good News for sugarcane farmers:  దేశవ్యాప్తంగా అధికంగా పండే పంటల్లో చెరుకు ఒకటి. తెలుగు రాష్ట్రాలలోను చెరుకును విరివిగా పండిస్తారు రైతులు. ఈ క్రమంలో చెరుకు రైతులకు మేలు చేకూరే నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. చెరుకు నుంచి ఉత్పత్తి అయ్యే చక్కెర నుంచి తీసిన ఇథనాల్‌కు ధరను ఖరారు చేసింది. చక్కెర నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌ను మూడు గ్రేడులుగా గుర్తించిన కేంద్ర కేబినెట్ మూడింటికి వేర్వేరు ధరలను ఖరారు చేసింది.

2020-21 సంవత్సరానికి ప్రభుత్వ రంగ ఏఎంసీలకు ఇథనాల్ సరఫరా కోసం అమలులోకి రానున్నాయి ఈ సవరించిన ఇథనాల్ ధరలు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రాం కింద ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా ఇథనాల్ సేకరణకు యంత్రాంగం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చక్కెర నుండి ఉత్పత్తి చేయబడిన ఇథనాల్ లీటర్ ధర రూ. 62.65 గా నిర్ణయించారు. ‘బి’ హెవీ మొలాసిస్ నుంచి తయారైన ఇథనాల్ లీటరు ధర రూ. 57.61 గాను, ‘సి’ హెవీ మొలాసిస్ నుంచి తయారైన ఇథనాల్ లీటరు ధర రూ. 45.69 గా నిర్ణయించారు.

పెట్రోల్‌పై విదేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి కొంతైనా తగ్గాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఇథనాల్‌ను పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకుంది మోదీ కేబినెట్. అదే విధంగా దేశవ్యాప్తంగా 736 ఆనకట్టల భద్రత, నిర్వహణ పనితీరును మెరుగుపరిచేందుకు సహాయపడే ఆనకట్ట పునరావాసం, అభివృద్ధి ప్రాజెక్టు (డీఆర్ఐపీ) ఫేస్ 2, ఫేస్ 3లను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

ఏప్రిల్ 2021 నుండి మార్చి 2031 వరకు డ్రిప్ ఫేస్2, ఫేస్ 3లను 10 వేల 211 కోట్ల రూపాయల వ్యయంతో అమలు చేయాలని నిర్ణయించారు. జనపనార పదార్థాలను తప్పనిసరిగా ప్యాకేజింగ్ కోసం వినియోగించాలంటూ, దానికి సంబంధించిన నిబంధనలను కేంద్ర మంత్రివర్గం సవరించింది. ఆహార-ధాన్యాలను వంద శాతం, చక్కెరను 20 శాతం వైవిధ్యమైన జనపనార సంచులలో ప్యాక్ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్దేశించింది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ అవుతాయి.

Also read:  ధరణీ పోర్టల్ సీక్రెట్ వెల్లడించిన కేసీఆర్

Also read: నవంబర్ 2 నుంచి ఏపీ స్కూళ్ళు రీఓపెన్… కండీషన్స్ ఇవే

Also read: ఏపీ సీఎంకు ఉండవల్లి ఉచిత సలహా

Also read: అతి చేయొద్దు సూర్యా.. రవిశాస్త్రి వార్నింగ్