Vaikunta Ekadasi 2020: తెలంగాణ వ్యాప్తంగా వైకుంఘ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శైవ, వైష్ణవ ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా వెలిగిపోతున్నాయి. దేవ వేవుల దర్శనం కోసం భక్తులు తెల్లవారు జామునుంచే ఆలయాల వద్దకు తరలి వస్తున్నారు. కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లెలగూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న శోభ, కవితకు ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కవిత వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
Also read:
కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం ఉధృతం.. హెలిప్యాడ్‌ను తవ్వేసిన రైతులు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి డేట్ ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే..