ఈ రోజు నుంచి నవంబర్‌ 3 వరకు మిజోరం రాజధానిలో లాక్‌డౌన్…

Complete Lockdown : మిజోరం రాజధాని ఐజ్వల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. మంగళవారం ఉదయం 4.30 గంటల నుంచి నవంబర్‌ 3 ఉదయం 4.30 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల విభాగం అధికారులు ప్రకటించారు. మిజోరం హోంమంత్రి, ఆరోగ్య మంత్రి నేతృత్వంలో సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సీఎం జోరంతాంగ అంగీకారం అనంతరం రాజధాని ప్రాంతమైన ఐజ్వల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. మంగళవారం […]

ఈ రోజు నుంచి నవంబర్‌ 3 వరకు మిజోరం రాజధానిలో లాక్‌డౌన్...
lockdown

Updated on: Oct 27, 2020 | 1:32 AM

Complete Lockdown : మిజోరం రాజధాని ఐజ్వల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. మంగళవారం ఉదయం 4.30 గంటల నుంచి నవంబర్‌ 3 ఉదయం 4.30 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల విభాగం అధికారులు ప్రకటించారు.

మిజోరం హోంమంత్రి, ఆరోగ్య మంత్రి నేతృత్వంలో సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సీఎం జోరంతాంగ అంగీకారం అనంతరం రాజధాని ప్రాంతమైన ఐజ్వల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు.

మంగళవారం ఉదయం 4.30 గంటలకు మొదలయ్యే ఈ లాక్‌డౌన్‌ నవంబర్‌ 3 ఉదయం 4.30 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు. అయితే వైద్య అధికారులు, పోలీసుల సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు కరోనా ఆంక్షలను పాటించడం లేదని రాష్ట్ర వైద్య అధికారులు తెలపడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా మాస్కులను ధరించాలని ప్రభుత్వం హెచ్చరించినా అక్కడి ప్రజలు పట్టించుకోవడం లేదని అక్కడి అధికారులు తెలిపారు.

మిజోరంలో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 2,500గా ఉన్నది. కరోనా వల్ల ఎవరూ కూడా మరణించలేదు.