ప్రాణాల మీదకు తెచ్చిన సెల్పీ మోజు.. కాకతీయ కాల్వలో ఇద్దరు గల్లంతు

సెల్పీ మోజులో మరో నిండు ప్రాణం బలైంది. కాల్వ గట్టున నిలబడి నీటి పరవళ్లతో ఫోటో దిగాలనుకున్నారు. అంతలో ప్రమాదవశాత్తు జారిపడి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రాణాల మీదకు తెచ్చిన సెల్పీ మోజు.. కాకతీయ కాల్వలో ఇద్దరు గల్లంతు

Updated on: Sep 07, 2020 | 10:39 AM

సెల్పీ మోజులో మరో నిండు ప్రాణం బలైంది. కాల్వ గట్టున నిలబడి నీటి పరవళ్లతో ఫోటో దిగాలనుకున్నారు. అంతలో ప్రమాదవశాత్తు జారిపడి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ కాకతీయ కాల్వలో పడి గల్లంతయ్యారు. ధరూర్ మండల పరిధిలో ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు జగిత్యాల పట్టణానికి చెందిన కిరణ్‌ (33), రవి (27) కాల్వ ఒడ్డున నిలబడి సెల్పీ దిగుతున్నారు. దీంతో ప్రమాదవశాత్తు రవి కాలు జారిపడబోయీడు. అంతలో కిరణ్ అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఇద్దరు నీటమునిగి గల్లంతయ్యారు. స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఓ యువకుడి మృతదేహన్ని వెలికి తీసిన రిస్య్కూ టీం మరొకరి కోసం గాలింపు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us