
నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) జారీ చేసిన నోటీసులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ నేత ఒకరు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిలో ఎంత మాత్రం నిజం లేదని ట్విటర్లో పేర్కొన్నారు.
‘ఓ కాంగ్రెస్ నాయకుడు నాపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయడం ఉద్దేశపూర్వకమే. గతంలో చెప్పినట్లుగా ఆ ఫామ్‌హౌజ్ నాది కాదు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే. సరైన న్యాయ సలహాలు తీసుకుని నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తానని’ కేటీఆర్ ట్వీట్ చేశారు.