చోక్సీ అభ్యర్థనను తిరస్కరించిన స్పెషల్ కోర్ట్!

వజ్రాల ఆభరణాల వ్యాపారి మెహుల్ చోక్సీ తనపై జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేయాలని ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. కానీ చోక్సీ దాఖలు చేసిన దరఖాస్తును ప్రత్యేక కోర్టు శుక్రవారం తిరస్కరించింది. సిబిఐ వేసిన పిటిషన్ ఆధారంగా ప్రత్యేక కోర్టు తనపై జారీ చేసిన వారెంట్‌ను రద్దు చేయాలని చోక్సీ కోరారు. తాను సిబిఐ నుండి తప్పించుకోలేదని, కానీ అనారోగ్యంతో సహా వివిధ కారణాల వల్ల దేశానికి రాలేనని చోక్సీ పేర్కొన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ […]

చోక్సీ అభ్యర్థనను తిరస్కరించిన స్పెషల్ కోర్ట్!
Mehul Choksi

Edited By:

Updated on: Dec 15, 2019 | 10:36 AM

వజ్రాల ఆభరణాల వ్యాపారి మెహుల్ చోక్సీ తనపై జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేయాలని ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. కానీ చోక్సీ దాఖలు చేసిన దరఖాస్తును ప్రత్యేక కోర్టు శుక్రవారం తిరస్కరించింది. సిబిఐ వేసిన పిటిషన్ ఆధారంగా ప్రత్యేక కోర్టు తనపై జారీ చేసిన వారెంట్‌ను రద్దు చేయాలని చోక్సీ కోరారు. తాను సిబిఐ నుండి తప్పించుకోలేదని, కానీ అనారోగ్యంతో సహా వివిధ కారణాల వల్ల దేశానికి రాలేనని చోక్సీ పేర్కొన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ మోసపూరిత లెటర్స్ జారీ చేసినందుకు చోక్సీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.