మెగా దంపతులకు సాదరంగా వెల్‌కమ్ చెప్పిన జగన్..!

ఏపీ సీఎం జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి.. భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వారిని సాదరంగా ఆహ్వానించారు. అలాగే.. చిరు కూడా.. జగన్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జగన్‌ సీఎం అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే మొదటిసారి. కాగా.. తన ‘సైరా’ సినిమా చూడమని చిరంజీవి.. జగన్‌ను కూడా […]

మెగా దంపతులకు సాదరంగా వెల్‌కమ్ చెప్పిన జగన్..!

Edited By:

Updated on: Oct 14, 2019 | 5:16 PM

ఏపీ సీఎం జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి.. భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వారిని సాదరంగా ఆహ్వానించారు. అలాగే.. చిరు కూడా.. జగన్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జగన్‌ సీఎం అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే మొదటిసారి. కాగా.. తన ‘సైరా’ సినిమా చూడమని చిరంజీవి.. జగన్‌ను కూడా కోరడం విశేషం.

ఈనెల 5న తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను చిరం‍జీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్‌ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు.

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఈనెల 2న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో భారీ వసూళ్లు సాధించింది. సినిమా హిట్‌ కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us