మోదీని వణికిస్తున్న ‘వారణాసి వనిత’!

మే 19.. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్. ఇప్పటికే మూడు సార్లు వారణాసి టూరేసిన మోదీ.. ఈసారి ఇక్కడ రిపీట్ కొట్టే తీరతానంటూ ధీమాతో వున్నారు. అందుకే.. ఏడో దశ పోలింగ్‌కి ముందు మళ్ళీ వారణాసి వెళ్లబోనంటూ షెడ్యూల్ మార్చుకున్నాడు. ఒకవైపు.. ఇంతటి భరోసాతో ఉన్నప్పటికీ.. మరోవైపు నుంచి ఆయన్నొక సందేహం పొడుస్తూనే వుంది. గతంలో 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ నుంచి గట్టి పోటీ తప్పదన్న వార్తలు కూడా […]

మోదీని వణికిస్తున్న వారణాసి వనిత!

Edited By:

Updated on: May 14, 2019 | 6:57 PM

మే 19.. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్. ఇప్పటికే మూడు సార్లు వారణాసి టూరేసిన మోదీ.. ఈసారి ఇక్కడ రిపీట్ కొట్టే తీరతానంటూ ధీమాతో వున్నారు. అందుకే.. ఏడో దశ పోలింగ్‌కి ముందు మళ్ళీ వారణాసి వెళ్లబోనంటూ షెడ్యూల్ మార్చుకున్నాడు. ఒకవైపు.. ఇంతటి భరోసాతో ఉన్నప్పటికీ.. మరోవైపు నుంచి ఆయన్నొక సందేహం పొడుస్తూనే వుంది. గతంలో 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ నుంచి గట్టి పోటీ తప్పదన్న వార్తలు కూడా ఆయన్ను ఇబ్బందిపెట్టాయి. కానీ.. అఖండ మెజారిటీతో నెగ్గారు. కానీ.. ఇప్పుడు ఏమవబోతోంది? మోదీ అనుమానానికి కారణం ఆమే.. షాలినీ యాదవ్..!

ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థిగా మోదీని ఢీకొంటున్న షాలినీ యాదవ్ మీద దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మాజీ జవాన్ తేజ్ బహద్దూర్ యాదవ్ నామినేషన్ తిరస్కారానికి గురవ్వడంతో చివరి నిమిషంలో ఈమెను ఓకే చేసింది కూటమి. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు బలపరుస్తున్న షాలినీ యాదవ్‌కి.. సొంత బ్యాక్‌గ్రౌండ్ కూడా గట్టిగానే వుంది. గతంలో వారణాసి ఎంపీగా గెలిచి.. కేంద్ర మంత్రిగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా చేసిన శ్యామ్ లాల్ యాదవ్‌కి ఈమె కోడలు. ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో కూడా బరిలో దిగిన షాలినీ యాదవ్.. రెండో స్థానంలో నిలిచి సత్తా చాటుకుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కూడా షాలినీ హవా నడుస్తుందన్న విశ్వాసం కొంతమందిలో లేకపోలేదు.

”2014లో ఆయనకు అన్నీ ఎలా అనుకూలంగా ఉండేవో.. అవన్నీ ఇప్పుడు ప్రతికూలంగా మారాయి. మోదీ చెప్పిన అచ్చే దిన్ ఎక్కడా కనిపించడం లేదు. మోదీ ఒక మోసగాడు అనే మాట అన్నివైపుల నుంచీ వినిపిస్తోంది. ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టం, గంగమ్మ ప్రక్షాళనను నిర్లక్ష్య పరచడం లాంటివన్నీ చూసి మోదీని ఓడించడానికి మహిళాలోకం సిద్ధంగా వుంది” అంటూ తనకున్న పాజిటివ్ ఎలిమెంట్స్‌ని ఏకరువు పెడుతోంది షాలినీ యాదవ్. కులం కార్డు, కూటమి బలం, విమెన్ సెంటిమెంట్.. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్.. ఇలా తనకు అనుకూలంగా అనేక అంశాలు ఉన్నాయన్నది ఆమె ధీమా. ఒకవేళ ఓడిపోయినా మోదీ లాంటి ఉక్కుమనిషిని ఢీకొట్టిన మహిళగా చరిత్రలో నిలిచిపోతుంది అంటూ.. షాలిని యాదవ్ మీద సానుభూతి కురిపిస్తున్నారు వారణాసి జనాభా.