Hyderabad: తలపై జుట్టు మొలిపిస్తామంటూ శఠగోపం పెట్టారు.. చీటింగ్ కంపెనీకి వినియోగదారుల కమిషన్ షాక్

|

Apr 16, 2022 | 10:46 AM

పలు సంస్థలు తమ ఉత్పత్తులను ప్రకటనల రూపంలో జనాలకు చేరవేసేందుకు ప్రయత్నిస్తాయి. ఆ ఉత్పత్తులు మంచివా, కావా ఆనేవి వేరే విషయం. అయితే వాటిని చూసేవారు కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా...

Hyderabad: తలపై జుట్టు మొలిపిస్తామంటూ శఠగోపం పెట్టారు.. చీటింగ్ కంపెనీకి వినియోగదారుల కమిషన్ షాక్
Justice
Follow us on

పలు సంస్థలు తమ ఉత్పత్తులను ప్రకటనల రూపంలో జనాలకు చేరవేసేందుకు ప్రయత్నిస్తాయి. ఆ ఉత్పత్తులు మంచివా, కావా ఆనేవి వేరే విషయం. అయితే వాటిని చూసేవారు కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటనపై వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది. తలపై జుట్టు రప్పిస్తామన్న ప్రకటనను చూసి, ఓ వ్యక్తిక సదరు కంపెనీని సంప్రదించాడు. వారు చెప్పినట్లు చేసి దాదాపు రూ.61,000 మోసపోయాడు. అయినా జుట్టు రాకపోవడంతో తన డబ్బు తిరిగివ్వాలని కోరాడు. డబ్బు ఇచ్చేందుకు సంస్థ నిరాకరించడంతో బాధితుడు వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఖమ్మం జిల్లా వైరా ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అక్రమ్‌ పాషా.. టీవీలో వచ్చిన ఓ ప్రకటనను చూసి బంజారాహిల్స్‌ శాఖను సంప్రదించాడు. తలపై వెంట్రుకలు పెరగాలని ప్రశ్నించగా ఆరు సిట్టింగ్ లలో బయోసెల్ చికిత్స పూర్తి చేస్తామని చెప్పారు. 2019 మార్చి 16న చికిత్స మొదలుపెట్టి, జూన్‌ నెలలో సిట్టింగ్‌లు పూర్తి చేశారు. అతని నుంచి రూ.60,330 తీసుకున్నారు. అయినా వెంట్రుకల్లో ఒక్క శాతం కూడా పెరుగుదల కాకపోవడంతో క్లినిక్‌లో ప్రశ్నించారు.

మరో మూడు సిట్టింగుల చికిత్స చేస్తే ఫలితం ఉంటుందని ఆ సంస్థకే చెందిన వైద్యురాలు తెలిపింది. ఆ చికిత్స పూర్తయినా ఫలితం లేకపోయేసరికి ఆ డాక్టర్ ను సంప్రదించేందుకు యత్నించినా వారి నుంచి స్పందన రాలేదు. వారి వ్యవహారంతో విసిగిపోయిన బాధితుడు.. తనకు డబ్బులు తిరిగివ్వాలని కోరాడు. అయితే డబ్బులు తిరిగిచ్చేందుకు ఆ సంస్థ తిరస్కరించింది. ఇక చేసేదేమీ లేక బాధితులు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. తమ సూచనలను పాషా పాటించలేదని, ఉద్దేశ్యపూర్వకంగానే తమపై ఆరోపణలు చేసి లాభపడాలని చూస్తున్నారని సంస్థ ప్రతినిధులు చెప్పారు.

వీటితో కమిషన్ ఏకీభవించకుండా బాధితుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కమిషన్‌-3 బెంచ్‌ అధ్యక్షుడు డా.రామ్‌గోపాల్‌రెడ్డి, సభ్యులు డి.శ్రీదేవి, జె.శ్యామల సాక్ష్యాధారాలను పరిశీలించి తీర్పు వెలువరించారు. చికిత్స ఫీజును 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని, రూ.50 వేల జరిమానా, కేసు ఖర్చులు రూ.10,000 ను 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు.

Also Read

Rakesh Jhunjhunwala: ఆ కంపెనీలో వాటాలు పెంచుకున్న బిగ్ బుల్ రాకేశ్‌ జున్‌జున్‌వాలా.. మీ దగ్గర కూడా ఈ షేర్ ఉందా..

Petrol Diesel Price Today: దేశంలో ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!

Viral Video: పట్టాల మధ్య మహిళ.. ట్రాక్ పై పరుగులు పెడుతున్న రైలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో